18 July, 2026 | 12:40 AM

ప్రజల్లో అవగాహన కోసం ‘సర్’పై ప్రచారం

18-07-2026 12:00 AM

సికింద్రాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పై ఓల్ బోయిన్ పల్లి,హస్మత్ పేట్ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓల్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తన స్వంత నిధులతో ఆటో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఓల్ బోయిన్పల్లి డివిజన్లోని ప్రతి ఇంటికి ఎస్‌ఐఆర్  ప్రక్రియకు సంబంధించిన సమాచారం చేరేలా, అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ఓటు హక్కును పరిరక్షించు కోవాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలోతప్పని సరిగా పాల్గొని, అవసరమైన వివరాలను నమోదు చేయించుకోవాలని,ఓటు హక్కును కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ హరినాథ్, జేకే తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని పరిశీలించిన మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్..

ఓల్ బోయిన్పల్లి డివిజన్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ  కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందితో మాట్లాడుతూ ఫారాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని,ప్రతి ఒక్క ఓటర్ కి ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ ముద్దం సూచించారు.

అలాగే ప్రజలు కూడా ఫారం అందుకున్న వెంటనే అవసరమైన వివరాలను పూర్తిగా నింపి,నిర్ణీత గడువులోపు సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్,బీఎల్‌ఓలు,బీఎల్‌ఏ లు తదితరులు పాల్గొన్నారు.