కంబోడియా సైబర్ ముఠా గుట్టురట్టు
- మ్యాట్రిమోనీ, సోషల్ మీడియాలో అమ్మాయిలుగా ఫేక్ ప్రొఫైల్స్
వలుపు వల.. సైబర్ ఉచ్చులోకి లాగింగ్
ప్రధాన నిందుతుడు ప్రసన్నకుమార్ అరెస్ట్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్లలో అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రొ ఫైల్స్ సృష్టించి, ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించి ఆన్లైన్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరిట లక్షలు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన పెదపూడి ప్రసన్న కుమార్‌ను కంబోడియా నుంచి తిరిగి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్టులో శుక్రవారం అరెస్ట్ చేశారు. హైదరా బాద్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడికి గత ఏడాది అక్టోబర్‌లో షాదీ డాట్ కామ్ ద్వారా అంజలి కందుల అనే పేరుతో ఓ ప్రపోజల్ వచ్చింది. తాను యూకేలో అజూర్ డెవాప్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని ఆమె పరిచయం చేసుకుంది.
విదేశీ వాట్సాప్ నంబర్ల తో చాటింగ్ చేస్తూ, ఆ యువకుడితో ఎంతో చనువుగా మాట్లాడింది. తాను సుదీర్ఘ బంధం కోరుకుంటు న్నానని నమ్మించింది. బాధితుడు ఆమె ప్రేమలో పూర్తిగా పడిపోయాక అసలు వల విసిరింది. తన బాబాయి ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో గొప్ప నిపుణుడని, అతని సలహాతో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అతి తక్కువ కాలంలోనే కళ్లు చెదిరే లాభాలు వస్తాయని ఒప్పించింది. భార్య కాబోయే అమ్మాయే చెబుతోంది కదా! అని ఆ యువకుడు గుడ్డిగా నమ్మాడు. ఆమె చెప్పినట్లే బాక్ట్కాయిన్ అనే నకిలీ క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లో ముందుగా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు.
దీంతో భారీగా లాభాలు వచ్చినట్లు చూపిస్తుండటంతో యువకుడికి నమ్మకం మరింత పెరిగింది. ఇదే అదనుగా బైనాన్స్ ద్వారా ఏకంగా రూ.11 లక్షల 17 వేలకు పైగా నగదును డిపాజిట్ చేసేలా ఆ సైబర్ కేటుగాడు ప్లాన్ చేశాడు. యువకుడు ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టగానే, అతని వాలెట్లో సుమారు 14 వేల డాలర్లకు పైగా ఉన్నట్లు బ్యాలెన్స్ చూపించారు. తీరా ఆ డబ్బును డ్రా చేసుకుందామని ప్రయత్నించగా.. అసలు కథ మొదలైంది. కస్టమర్ సపోర్ట్ పేరుతో రంగంలోకి దిగిన మోసగాళ్లు పన్ను లు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో మరింత డబ్బు కట్టాలని ఒత్తిడి చేశారు.
లాభాలు రాకపోగా, పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి పోలీసులను ఆశ్రయించాడు. టెక్నాలజీ సాయంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన పెదపూ డి ప్రసన్నకుమార్ (32) అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు.
డేటా బేస్ ఉద్యోగానికి వెళ్లి సైబర్ కింగ్‌పిన్‌గా మారి..
పెదపూడి ప్రసన్నకుమార్2024 ఏప్రిప్ లో డేటా బేస్ ఉద్యోగం కోసం ఓ కన్సల్టెన్సీ ద్వారా కంబోడియా వెళ్లాడు. అక్కడ భార తీయులనే లక్ష్యంగా చేసుకుని మోసా లకు పాల్పడే సైబర్ గ్యాంగ్‌తో చేతు లు కలిపాడు. సులభంగా డబ్బు సంపాదిం చాలనే ఆశతో మోసాల్లో శిక్షణ పొందాడు. విశాఖపట్నం లో గతంలో అరెస్టయిన కొందరి దగ్గరి నుం చి సుమారు 500 దాకా అక్రమ సిమ్ కార్డు లు తెప్పించుకున్నాడు. వాటితో అమ్మా యి ల పేర్లతో మ్యాట్రిమోనీ, సోషల్ మీడి యా ఖాతాలు తెరిచి అమాయక యువకుల కు వల వేయడం మొదలు పెట్టాడు.
కంబో డి యా నుంచి ఇండియాకు వస్తుండగా పక్కా సమాచారంతో చెన్నై విమానాశ్రయం లో పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితు డి నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, అతడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామని సైబర్ క్రైమ్స్ డీసీపీవీ అరవింద్‌బాబు తెలిపారు




