ఉద్దెమర్రి అంగన్వాడీ- కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్
శామీర్ పేట్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లోని ఉద్దెమర్రి 21 వార్డులో గల అం గన్వాడీ-2 కేంద్రాన్ని జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్ ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.
చిన్నారు లకు అందిస్తున్న ఆహారం నాణ్యత,వంట విధానం, పరిశుభ్రత, పోషకాహార పట్టిక అమలు విధానం తదితర అంశాలను స్వయంగా పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన చైర్మన్ వారి ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
అంగన్వాడి కేంద్రానికి వస్తున్న పసిపిల్లలకు సమయానికి, నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చే శారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం సరైన మోతాదులో, పరిశుభ్ర వాతావరణంలో వండి అందించాలని పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని హె చ్చరించారు. అంగన్వాడి టీచర్, ఆయమ్మ నాతో సమావేశమై చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు ఆరోగ్య రికార్డులు సమగ్రంగా నమోదు చేస్తున్నారా అని విషయాన్ని తెలుసుకున్నారు.
గర్భిణి స్త్రీలు, బాలింతలకు అందించే పోషకాహారం కూడా నాణ్యతతో ఉండాలని కేంద్రానికి వచ్చే ప్రతి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడి భవనం పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, వంటగదిని పరిశీలించారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉండాలంటే బాల్యంలోనే సరైన పోషకాహారం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, కౌన్సిలర్లు రాజీగాళ్ల లతా భూపాల్, పెద్దిరెడ్డి శ్రీలత వెంకట్ రెడ్డి, దోసకాయల లతా వెంకటేష్, పులి ప్రభాకర్, గోవర్ధన్ రెడ్డి, మల్లేష్, మాజీ సర్పంచ్ నర్సింహా, విష్ణుగౌడ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.




