28 February, 2026 | 9:15 AM

కౌకూర్‌లో క్యాబ్ డ్రైవర్ అదృశ్యం

28-02-2026 12:28 AM

పీఎస్‌లో ఫిర్యాదు

జవహర్ నగర్, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి): క్యాబ్ డ్రైవర్ అదృశ్యమైన సంఘ టన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కౌకూర్లో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్లో తోట సాంబమూర్తి, కుమారుడు తోట హరీష్ కుటుంబం కౌకూరు పరిధిలోని భరత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. హరీష్ కుమార్ (25) క్యాబ్ డ్రైవర్‌గా జీవనోపాధి పొందు తున్నాడు.

ఈనెల 26న హరీష్ కుమార్ ఉదయం 9 గంటలకు తన కారును తీసు కొని ఇంటి నుండి బయటకి బయలు దేరి వెళ్లి మధ్యాహ్నం 12:30 గంటలకు తన తండ్రితో ఫోన్లో మాట్లాడిన తర్వాత సాయం త్రం తిరిగి ఇంటికి రాలేదు. ఈ మేరకు అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికినా బంధువుల వద్ద వెతికినా తెలిసిన వారి వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు తండ్రి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.