బోరోసిల్ ‘స్వాద్ కా సఫర్’ విజేతగా సి.వనమాల వర్ధన్
బంజారాహిల్స్, ఆగస్టు 22(విజయక్రాంతి): మెట్రో హోల్ సేల్ భాగస్వామ్యంతో ప్రముఖ కన్సూమర్ వేర్ బ్రాండ్ బోరోసిల్ తమ స్వాద్ కా సఫర్ గ్రాండ్ ఫినాలేను నగరంలో నిర్వహించింది. ఈ పోటీల్లో సి.వనమాల వర్ధన్ ను విజేతగా ప్రకటించారు. ఈ విషయమై నిర్వాహకులు మాట్లాడుతూ హోం చెఫ్ లు, ఆహార ప్రియులు, కస్టమర్లను ఒకచోట చేర్చేందుకు స్వాద్ కా సఫర్ పోటీలను నిర్వహించామన్నారు.
వంటలు, పోటీలు, వినోదంతో కూడిన ఈ పోటీల్లో ఆన్ గ్రౌండ్ కుకింగ్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకొందని పేర్కొన్నారు. మెట్రో హోల్ సేల్ వేదికగా జరిగిన ఫినాలే లైవ్ కుకింగ్ పోటీల్లో వనమాల వర్ధన్ విజేతగా నిలిచారని ప్రకటించారు. జడ్జిగా వ్యవహరించిన ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ హర్పాల్ సింగ్ సోఖీ విజేతకు బహుమతి అందజేశారని తెలిపారు.
స్వాద్ కా సఫర్ పోటీలో భాగంగా ఎంపికైన ముగ్గురు ఫైనలిస్టులు తమ వంట నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరిచరాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చెఫ్ హర్పాల్ వంటకాలను రుచి చూడడమే కాకుండా తమ విలువైన సూచలను చెఫ్ లతో పాటు వీక్షకులకు అందజేశారని వెల్లడించారు.






