త్రిష ఇన్‌స్టా స్టోరీస్ చుట్టూ చర్చ!
ప్రస్తుతం నటి త్రిష కృష్ణన్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, సీఎం విజయ్ భార్య సంగీత ఇటీవల కోర్టులో దాఖలు చేసిన తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. భారీ భరణం సెటిల్‌మెంట్‌తో ఈ వివాదం సర్దుమణిగిందని, కుటుంబ పరువు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు, సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.
అయితే, ఈ రెండు వివాదాల మధ్య కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న త్రిష.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ఈ వయసులో ఇలాంటి డ్రామాలు చేయడం సిగ్గుచేటు.. వెళ్లి కాస్త డబ్బు సంపాదించుకుని, ప్రశాంతతను వెతుక్కోండి. ఒకప్పుడు మనం ప్రార్థించిన జీవితం ఇప్పుడు మనకు లభించడం ఎంతటి అదృష్టం” అంటూ తన పోస్ట్లలో ఇలా రాసుకొచ్చింది త్రిష. ఇందులో ఆమె ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఈ పోస్టులు ఎవరిని ఉద్దేశించినవనే దానిపై నెటిజన్లు రెండు రకాలుగా విశ్లేషిస్తున్నారు. తన పేరును అనవసరంగా రాజకీయాల్లోకి లాగి డ్రామాలు చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ లేదా అన్నాడీఎంకే నేతలను ఉద్దేశించి అని కొందరు భావిస్తున్నారు.
భారీ మొత్తంలో డబ్బు తీసుకుని విడాకుల కేసును వెనక్కి తీసుకున్న విజయ్ భార్య సంగీతను ఉద్దేశించే త్రిష ఈ ‘డబ్బు సంపాదించుకుని ప్రశాంతంగా ఉండు’ అనే కౌంటర్ ఇచ్చారని కోలీవుడ్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. అయితే వివాదం మరింత ముదురుతుందనే భయంతో త్రిష ఆ పోస్టును 24 గంటల లోపే డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో, అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ విజయ్‌ను విమర్శించే క్రమంలో ‘తమిళనాడు ప్రజలు త్రిషను డిప్యూటీ సీఎంగా చూడాలని ఎదురుచూస్తున్నారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన త్రిష అభిమానులు మదురైలో ఆర్బీ ఉదయకుమార్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు కూడా వేశారు.






