26 May, 2026 | 6:17 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

తడిసిన ధాన్యం, పత్తి కొనండి

06-11-2025 01:51 AM
  1. పరిహారం రూ.30 వేలు ఇవ్వాలి
  2. సీఎంకు బీజేఎల్పీ నేత లేఖ

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): మొంథా తుఫాను వల్ల జరిగిన పంట నష్టానికి ఎకరానికి రూ.30 వేల పరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలను తేమశాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహే శ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాసినట్లు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్రం అమ లు చేస్తున్న ఫసల్ బీమా యోజనలో తెలంగాణ రాష్ట్రం చేరేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే పంటలబీమా పథకాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. పంట నష్టం పరిహారంగా ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించడం రై తాంగాన్ని తీవ్రంగా నిరాశ పరిచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 23 నెలల్లో ప్రభుత్వం ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ ఎంతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.