సమాజ సేవలో విఎన్ఆర్ ఫౌండేషన్
పది విద్యార్థులకు మజ్జిగ పంపిణీ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సామాజిక సేవలో విఎన్ఆర్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్ రెడ్డి అన్నారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థమై పరీక్ష కేంద్రాల వద్ద విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో అనేక అద్భుతాలు సృష్టిస్తున్నామని అంతేకాకుండా సామాజిక సేవతో పాటు పేదవారికి విఎన్ఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు, ఎండ తీవ్రతలు అధికంగా ఉండడంతో విద్యార్థులను ఎండ దెబ్బకు గురి కాకుండా ఉండేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్నిచేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో విఎన్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు గోపతి సత్యం, బి. రవీందర్, వేముల కిరణ్, రామకృష్ణ, ఇక్బాల్ తదితరులున్నారు.




