20 April, 2026 | 7:42 PM

కల్లూరులో మజ్జిగ పంపిణి

20-04-2026 06:20 PM

కల్లూరు,(విజయక్రాంతి): ప్రజలకు సేవాభావంతో ముందుండే ఆదర్శ దంపతులు ఐలూరి రామకృష్ణారెడ్డి–లక్ష్మి తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కల్లూరు బస్టాండ్‌లో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి తీవ్రతలో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బ నుండి ఉపశమనం పొందేలా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీం సత్తుపల్లి, ప్రయాణికులు, కల్లూరు ప్రజల తరఫున దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో మరెన్నో ఆనందకరమైన వేడుకలు జరుపుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఉచిత మజ్జిగ పంపిణీ చేసినందుకు దంపతులకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.