రాజీవ్ రహదారిపై బస్సు, లారీ ఢీ
09-03-2026 01:03 PM
8 మందికి తీవ్ర గాయాలు
గజ్వేల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం రాజీవ రహదారి పై బస్సు,లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ నుండి సిద్దిపేటకు వస్తున్న సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




