బస్సు కండక్టర్ నిజాయితీ
21-08-2026 09:02 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ డిపోకు చెందిన కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. ఖానాపూర్ నుండి నిర్మల్ వస్తున్న ఒక ప్రయాణికుడు బస్సులో పర్సు పో గొట్టుకొని బస్సు దిగిపోయాడు. కండక్టర్ భూలక్ష్మిఆఫర్స్ కనిపించడంతో దాన్ని తీసుకొని చూడగా అందులో 6,200 ఉన్నాయి నగదు ఇతర కార్డులు లభించాయి. డ్యూటీ కండక్టర్ భూలక్షి అది గమనించి స్టేషన్ మేనేజర్ కు అప్పగించగా అందులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా బాధితుని గుర్తించి స్థానిక బస్టాండ్ లో అప్పగించినట్లు తెలిపారు.కార్యక్రమములో స్టేషన్ మేనేజర్ ఎన్. రాజశేఖర్,డ్యూటీ కంట్రోలర్లు గంగన్న, రమేష్ లు ఉన్నారు. పర్సు అప్పగించిన ఆర్టీసీ అధికారులకు బాధితుడు కృతజ్ఞతలు తెలుపగా నిర్మల్ డిఎం పండరి అభినందనలు తెలిపారు.






