21 August, 2026 | 10:48 PM

సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే

21-08-2026 09:54 PM

రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని నేరడిగొండ, చిన్నగోధుమల్లె పెద్ద గోధుమల్లె, నారాయణ పూర్ గ్రామాల్లో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్లే రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు  పర్యటించారు. గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ముందుగా సిరిచేల్మా గ్రామంలో కొలువై ఉన్న పురాతన శివాలయాన్ని దర్శించుకొని అక్కడి నుంచి పర్యటనను ప్రారంభించారు. మొదటగా నేరడిగొండ జి, గ్రామ పంచాయితీలో సమావేశం నిర్వహించారు.

అనంతరం నారాయణ్ పూర్ గ్రామంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామానికి రావడానికి రోడ్డు సౌకర్యం సరిగా లేదని దానిని మంజూరు చేసి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు తన దృష్టికి తీసుకురాగా పరిస్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. గత పాలకులు గ్రామంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వం ఇండ్లు లేని ఆదివాసులకు 100% ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు. గ్రామానికి ఇప్పటికే  ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని ఇంకా తనవంతు కృషిగా గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేపిస్తానన్నారు.

వచ్చే జనవరి మాసం వరకు మరో 20 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసే భాద్యత తీసుకుంటానన్నారు. గత ప్రభుత్వం పది  ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలకు తిప్పలు పెట్టిందని కానీ  సీఎం రేవంత్ రెడ్డి  సర్కారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేసి సన్న బియ్యాన్ని అందిస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు, రెండు లక్షల రుణ మాఫీ, ఎకరానికి 12 వేల ఆర్థిక సహాయం లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పెదాలను ఆదుకుంటుందన్నారు. గ్రామ కమిటీ హల్ కు పూర్తి చేస్తామని, అలాగే నీటి సమస్య తీర్చేందుకు రెండు బోర్లు కొట్టించే భాద్యత తనదేనాన్నారు.

గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య,ఇచ్చోడ మార్కెట్ చైర్మన్ కొమరం సత్యవతి కోటేష్, కళ్లెం నారాయణరెడ్డి, ఇచ్చోడ మండల అధ్యక్షులు, సిరికొండ మండల అధ్యక్షులు కంచ లక్ష్మణ్,  ఇచ్చోడ సర్పంచ్ జులై జాకు, సిరికొండ సర్పంచ్ దత్తాత్రేయ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్సీ డిపార్ట్మెంట్ జైపాల్, కొత్తూరు లక్ష్మణ్ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్, జనరల్ సెక్రెటరీ, బోత్ నియోజకవర్గం మైనార్టీ చైర్మన్ ముస్తఫా, బోట్ బ్లాక్ ప్రెసిడెంట్ ప్రపోల్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ శేషారావు, మేడిగూడ సర్పంచ్, మడవి భీమ్ రావు, మల్యాల సర్పంచ్ మేస్రం దేవరావ్, బజారత్నూర్ మండల అధ్యక్షుడు, జంటి, కళ్లెం విట్టల్, నేరడిగొండ జి సర్పంచ్ పెందూర్ గుణవంత్,  మునేశ్వర్ కోటేష్, చిక్రం నాగరావ్ మాజీ సర్పంచ్, ధరంపురి సర్పంచ్ సోయం విశ్వనాధ్,

దుబాయ్ పెట్ సర్పంచ్  విట్టల్ ఇచ్చోడ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్, ఏఎంసీ డైరెక్టర్ బైరి లచ్చన్న, ఆత్మ డైరెక్టర్ షేక్ గౌస్, ఎక్స్ ఎంపిటిసి ప్రవీణ్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు క్రాంతికుమార్,ex ఎంపిటిసి భీమ్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజు, సల్యాదా సర్పంచ్, తుడసం లక్ష్మణ్, అడిగాం సర్పంచ్ రేస్ పోతారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు షేక్ ఇమామ్,చోలే ప్రభాకర్ జనరల్ భజరత్నూర్ మాజీ మండల్ ప్రెసిడెంట్, జెల్ కే పాండురంగ, మాజీ జెడ్పిటిసి రఘురాం సెక్రెటరీ మధుకర్, భూతి లక్ష్మణ్, చంద్రశేఖర్, జగదీశ్వర్, ఇక్బాల్, జహీర్, అబ్దుల్ కరీం, ఆత్రంగంగారాం, పటేల్, మహాజన్, దేవరీ, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.