పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
కొల్లాపూర్ రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో శుక్రవారం జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు వ్యక్తులు పట్టుబడినట్లు సమాచారం. పట్టుబడిన వారిలో కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్, మండలంలోని అధికార పార్టీకి చెందిన ఓ గ్రామ సర్పంచ్ ఉన్నట్లు తెలుస్తోంది.
వారి నుంచి సుమారు రూ.50 వేల నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం ఉందన్న ప్రచారం స్థానికంగా జోరుగా సాగుతోంది. అయితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు పట్టుబడిన నేపథ్యంలో విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో పోలీసులు గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది.






