21 August, 2026 | 10:48 PM

పొక్సో కేసులో నిందుతుడికి నాలుగేళ్ళ జైలు

21-08-2026 09:01 PM

రూ. 2వేల జరిమానా

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికల పట్ల ఆసభ్యకరంగ  ప్రవర్తించిన (పోక్సో) కేసులో నిందుతుడీకి నాలుగేళ్ళ  జైలు శిక్ష,రూ. 2వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ శుక్రవారం   రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పాఠశాల ప్రాంగణంలో గోడా  ధూకి బాలికలతో అగదండి రాజేందర్ అనే వ్యక్తి ఆసభ్యకరంగ ప్రవర్తించగా , పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు  మెరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అప్పటి ఎస్.ఐ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు విచారణలో భాగంగా కోర్టు మానిటరింగ్ ఎస్‌.ఐ లు రవీందర్ నాయుడు, శ్రవణ్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్  కానిస్టేబుల్  నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 10మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ గారు వాదించగా,శాస్త్రీయ ఆధారాలు,సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరము రుజువు కావడంతో నిందితుడైన అగదండి రాజేందర్ కు నాలుగేళ్ళ జైలు శిక్ష రూ. 2వేల జరిమాన విధించారు.

నేరం చేసిన వారు ఎవరు తప్పించుకోలేరు

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని,శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ తెలిపారు.పోలీసులు  ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ,న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.ఈకేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి ఎస్ఐ మహేష్, ప్రస్తుత డిఎస్పీ నాగేంద్రచారి , పబ్లిక్ ప్రాసిక్యూటర్ ,జాన్సీ,ఎల్లారెడ్డిపేట్ సర్కిల్ సి.ఐ ఓ.వెంకటేష్ గంభీరావుపేట ఎస్.ఐ శ్రీకాంత్,కోర్టు మానిటరిoగ్ ఎస్‌.ఐలు రవీందర్ నాయుడు,శ్రవణ్ యాదవ్ ,కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్,cms కానిస్టేబుల్  నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల లను , లీగల్ సపోర్ట్ పర్సన్ లహరిక లను జిల్లా ఎస్పీ అభినందిచారు.