18 May, 2026 | 3:04 AM

దాతృత్వంతో ఆదర్శ సమాజ నిర్మాణం

18-05-2026 12:00 AM

ఆర్బీవీఆర్‌ఆర్ ఈఎస్‌ఎస్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, జేఎస్ ఎస్‌ఎన్ రెడ్డి

ముషీరాబాద్, మే 17 (విజయక్రాంతి): అచ్యుత సమంత ప్రారంభించిన ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్’ ఉద్యమం 13 వసంవత్సరంలోకి అడుగుపెట్టింది. ‘పంచుకోవడంలోనే ఆనందం’ అనే సందేశంతో మే 11 నుంచి 17 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఆర్ట్ ఆఫ్ గివింగ్ తెలంగాణ కో ఆర్డినేటర్ పి. రాజా రమేష్ నేతృత్వంలో ఆదివారం ఆబిడ్స్‌లోని రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నీని సొసైటీ సెక్రటరీ ప్రొఫెసర్ జి. గోపాల్, జాయింట్ సెక్రెటరీ ఎస్‌ఎన్‌రెడ్డిలు హాజరై ప్రారంభించారు. ఈ వారో త్సవాల్లో భాగంగా వాలీబాల్ కిట్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు బోధనా సామగ్రి అందజేత, ఆహార పంపిణీ, మొక్కలు నాటడం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

యువతలో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, క్రీడాస్ఫూర్తి పెంపొందిం చడమే ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం 200కు పైగా దేశాలకు విస్తరించిన ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్’ ఉద్యమం, దాతృత్వాన్ని జీవన విధానంగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గిరిజన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ సమాజంలో సమానత్వం, మానవత్వం పెంపొం దించడంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్‌రెడ్డి, జానకి రెడ్డితో పాటు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.