4 April, 2026 | 2:43 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

కూతుళ్లను బావిలోకి తోసిన తండ్రి

04-04-2026 02:45 AM
  1. ఇద్దరు చిన్నారులు మృతి
  2. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ.. భారీ బందోబస్తు ఏర్పాటు

కొత్తపల్లి, ఏప్రిల్ 3(విజయక్రాంతి): అభం శుభం తెలియని చిన్నారులను తండ్రే స్వయంగా బావిలోకి తోసి చంపేశాడు. అ నంతరం తానూ బావిలోకి దూకాడు. ఊపిరి ఆడకపోవడంతో బావి బయటకు వచ్చేశా డు. చిన్నారుల గురించి ఏమీ తెలియనట్లు ప్రవర్తించాడు. అనుమానంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్‌కి చెందిన కచ్చు శ్రీశైలం, మానకొండూరు మండలం లక్ష్మీపూర్‌కి చెందిన చుక్క రాజమల్లు కుమార్తె మౌనికతో వివాహం ఆరు సంవత్సరాల క్రితం జరిగింది.

వీరికి గాతాంశీ, గీతాన్విక  కవల కూతుర్లున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం సాయంత్రం తన పిల్లలను శ్రీశైలం పొలానికి తీసుకెళ్లి, వారిని బావిలోకి తోశా డు. అనంతరం తానూ బావిలోకి దూకాడు. నీటిలో ఊపిరాడక ఈతకొడుతూ తనొక్కడే బయటికొచ్చాడు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లి వెతికింది. భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శ్రీశైలంను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు నిజం బయటకొచ్చింది. వెంటనే పొలంలోని బావి వద్ద గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. చిన్నారుల హత్య అనే వార్త దావా నంలా వ్యాపించడంతో గ్రామంలో ఉద్రిక్తత లు తలెత్తాయి. వెంటనే స్పందించిన ఏసీపీ విజయ్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.