రేపు బాన్సువాడలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
బాన్సువాడ, ఆగస్టు 29 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న 10 రోజుల కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబ్బేర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్‌లో ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతుందని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇప్పటికీ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.ఈ సమావేశానికి బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జి విజీ గౌడ్, బాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జి తోట ఆగన్న తదితరులు పాల్గొంటారని తెలిపారు.నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సమన్వయ కమిటీ సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని షేక్ జుబ్బేర్ కోరారు.






