12 May, 2026 | 8:58 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

ఉద్యమకారులకు అండగా బీఆర్‌ఎస్

13-03-2026 01:16 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు 

మొయినాబాద్, మార్చి 12(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

గురువారం మొయినాబాద్ మండల, మున్సిపల్ గ్రామాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఖైరతాబాద్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి, మొయినాబాద్ మండల ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి గరుగు రజినీకాంత్, యువజన విభాగం అధ్యక్షులు చాకలి అరవింద్, ఉపాధ్యక్షులు మహమ్మద్ నీయాజుద్దీన్, సీనియర్ ఉద్యమకారులు బిక్షపతి గౌడ్, జొన్నాడ బాలరాజ్, చాకలిగూడ ఆంజనేయులు కలిసి నానకరంగూడలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిధులు నియామకాలు అనే లక్ష్యాలు నెరవేరలేదని, నిరుద్యోగ సమస్యలపై హరీష్ రావు పోరాడాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సరైన గుర్తింపు, ఇంటి స్థలాలు వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చల ఒత్తిడి తీసుకురావాలని హరీష్ రావును వారు కోరారు.

హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను నాయకులను పార్టీ గుర్తించి రానున్న ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో టికెట్ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండల, మున్సిపల్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.