17 August, 2026 | 6:52 PM

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని బిఆర్ఎస్ నిరసన

17-08-2026 05:59 PM

ఘట్ కేసర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి  ఆదేశానుసారం మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ కార్యాలయం ముందు టిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం జరిపారు.

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వకుండా హైకోర్టు సూచించిన విధంగా తన వాదనను వినిపించకపోవడంతో హైకోర్టు షాదీముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను నిలిపి వేయాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా నిరసనగా తహసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు.

అనంతరం కార్యాలయంలో ఎమ్మార్వో లేకపోవడంతో కింది స్థాయి అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్లు పలుగుల మాధవరెడ్డి, రెడ్యానాయక్, సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపిటిసి సభ్యులు, మాజీ వార్డ్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.