అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలి
బస్సు యాత్రకు సంఘీభావం తెలిపిన గౌడ సంఘం నాయకులు
గణపురం, ఆగస్టు 17 (విజయక్రాంతి): గీత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ‘అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర’కు సోమవారం గణపురం మండల గౌడ సంఘం నేతలు సంఘీభావం తెలిపారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ ను మర్యాదపూర్వకంగా కలిసారు.
ఆగస్టు 2న మానుకోట నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర ఈ నెల 18న మల్కాజ్‌గిరికి చేరుకుని, అనంతరం ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుందని తెలిపారు. గౌడ, బహుజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తిని శివశంకర్ గౌడ్, మార్క చిన్న మొగిలి గౌడ్, ఆరెల్లి కుమార్ గౌడ్, గుర్రం సదానందం గౌడ్, ఆరెల్లి రాజు గౌడ్, కుమార్ గౌడ్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






