17 June, 2026 | 5:15 PM

నా ఎత్తుతో రేవంత్ కి ఏం పని: హరీశ్ రావు

17-06-2026 03:53 PM

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొని రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ''నా ఎత్తు గురించి స్కూల్ పిల్లల దగ్గర రేవంత్ విమర్శలు చేశారు. నా ఎత్తుతో రేవంత్ కి ఏం పని. రేవంత్ కంటే గట్టిగా తిట్టగలను.. కానీ.. నాకు విజ్ఞత ఉంది. హామీల గురించి నిలదీస్తూనే ఉంటా, స్కాములు బయటపెడుతూనే ఉంటా.'' అని హరీశ్ రావు పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం అసలైన ఓటర్లు జాబితాను తయారు చేస్తుందన్నారు. డబుల్ ఓట్లు, చనిపోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తారని పేర్కొన్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్లు స్థానిక అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో కార్యకర్తలు తప్పకుండా పాల్గొనాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. త్యాగాలు బీఆర్ఎస్ వంతు.. మోసాలు రేవంత్ రెడ్డి వంతు అని హరీశ్ రావు ఆరోపించారు. తాటిచెట్టులా పెరిగిండంటూ తనపై సీఎం ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.