రాజకీయ వ్యభిచారిలా బీఆర్‌ఎస్
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ రాజకీయ వ్యభిచారిలా మారిందని ఫిషరీస్ కార్పొరేష న్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇబ్రహీంపట్నంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచిందని, బీఆర్‌ఎస్ చైర్మన్, బీజేపీ వైస్ ఛైర్మన్ అయ్యారని విమర్శించారు. క్యాతనపల్లిలో బీఆర్‌ఎస్ దౌర్జన్యా లకు పాల్పడి సీపీఐ పార్టీ మద్దతు ఇస్తే గెలిచిందని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలి పారు.
కేటీఆర్ రాష్ట్రంలో అనైతిక రాజకీయా లు చేస్తున్నారని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయని, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పని చేశాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలని సాయికుమార్ విజ్ఞప్తి చేశారు.




