5 April, 2026 | 4:24 AM

రాణిగంజ్ డిపోలో బీసీ శక్తి ప్రదర్శన

05-04-2026 12:27 AM

ఎమ్మెల్సీ మల్లన్న ఆధ్వర్యంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగులకు భరోసా

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఉన్న టీజీఎస్‌ఆర్టీసీ బీసీ ఎంప్లా యిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాణిగంజ్ డిపో నూతన డిపో కమిటీ ఆవిర్భావ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్లన్న తరఫున ముఖ్య అతిథిగా దేవుళ్ళ సమ్మయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వ్యవ స్థాపక అధ్యక్షులు, అలాగే రాణిగంజ్ డిపో గౌరవాధ్యక్షులుగా నియమితులైన వెంకట్ కుంట్ల ముదిరాజ్ తమ అనుచరులతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశా రు.

ఈ సందర్భంగా రాణిగంజ్ డిపో బీసీ ఉద్యోగులకు బాసటగా నిలుస్తూ, నూతనం గా ఏర్పడిన బీసీ ఉద్యోగుల కమిటీని డిపో మేనేజర్‌కు, అసిస్టెంట్ మేనేజర్‌కు, మెకానిక్ ఫోర్ మెన్‌కు పరిచయం చేశారు. బీసీ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం తమ సంపూర్ణ సహకారం అందించాలంటూ అధికారులను కోరారు. తీన్మార్ మల్లన్న నాయ కత్వంలో రాణిగంజ్ డిపో బీసీ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పున్న హరికిషన్ (జనరల్ సెక్రటరీ), సంపత్ ముదిరాజ్ (ప్రెసిడెంట్), మహమ్మద్ సాజిద్ (స్టేట్ జాయిం ట్ సెక్రటరీ), దుర్గేష్ గౌడ్ (రాష్ట్ర ప్రచార కార్యదర్శి), అలాగే డిపో కమిటీ చైర్మన్ మల్ల య్య, డిపో ప్రెసిడెంట్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకరయ్య, డిపో సెక్రటరీ చంద్రమౌళి, ట్రెజరర్ వెంకటేష్ పాల్గొన్నారు.