నేడు టీఆర్పీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
05-04-2026 12:29 AM
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షు డు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోబడనున్నాయి.
ముఖ్యంగా పార్టీ నిర్మాణం బలో పేతం, సభ్యత్వ నమోదు విస్తరణ, అలాగే తీన్మార్ మల్లన్న ప్రతిష్టాత్మక పాదయాత్ర అంశాలు ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి. పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన వ్యూహాలపై సవివరంగా చర్చించనున్నారు.




