కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని బిఆర్ఎస్ నాయకుల నిరసన
01-04-2026 03:27 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద బుధవారం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట ఇప్పటికే అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వారు తెలిపారు. కొనుగోళ్లు లేకపోవడంతో చేతికొచ్చిన పంట అకాల వర్షాలకు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.




