1 April, 2026 | 5:27 PM

బోయినిపేట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా

01-04-2026 03:31 PM

బోయినిపేటలో ముదిరాజ్ కులస్థుల ఆత్మీయ సన్మానలో కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి

మంథని,(విజయక్రాంతి): బోయినిపేట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బుధవారం బోయినిపేటలో ముదిరాజ్ కులస్థుల ఆత్మీయ సన్మానలో కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి అన్నారు.  అభ్యర్థిగా సింహం గుర్తు మీద పోటీ చేసి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థుల మీద ఒంటరి పోరాటం చేసి పెద్దపల్లి జిల్లాలోనే రికార్డ్ స్థాయిలో అత్యధిక మేజర్టీ సాధించిన కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి ని బోయిన్ పేట్ కు చెందిన ముదిరాజ్ కుల పెద్దమనిషులు  శాలువువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా  శ్రీలతక్రాంతి మాట్లాడుతూ బోయినిపేట వార్డు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన బోయినిపేట 6వార్డ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయినిపేట ముదిరాజ్ కుల పెద్దమనుషులు, మహిళలు, ముదిరాజ్ యువత, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.