12 May, 2026 | 5:04 PM

సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి : బీఆర్ఎస్ నేతల డిమాండ్

12-05-2026 04:03 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న మాట్లాడుతూ, సాయి భగీరథపై పోక్సో కేసు నమోదై నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. బాధిత యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు.

ఈ కేసును బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు సాయి భగీరథను విచారణకు హాజరుపరచాలని డిమాండ్ చేశారు. కేసు నమోదై కూడా అరెస్టు జరగకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నదన్నారు.

హనీ ట్రాప్ పేరుతో మీడియా, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సిట్ విచారణ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే అరెస్టు చేసి బాధిత యువతికి న్యాయం చేయాలని కోరారు. లేకపోతే ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతారని హెచ్చరించారు.