23 June, 2026 | 11:30 AM

కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

23-06-2026 10:19 AM

కామారెడ్డి, జూన్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యూరియా సరఫరా చేయాలని అడిగిన రైతులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని కామారెడ్డి పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడువాయిలో ప్రభుత్వం యూరియా అందించడం లేదని రైతు లు నిరసన చేపట్టగా రైతులకు మద్దతుగా కామారెడ్డి నుంచి బిఆర్ఎస్ నాయకులు తరలి వెళ్తున్న విషయాన్ని గ్రహించిన పోలీసులు మంగళవారం ఉదయం బిఆర్ఎస్ నేతల ఇంటి వద్దకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణంలో ముఖ్యమైన బీర్ ఎస్ నాయకులను కామారెడ్డి పోలీస్ స్టేషన్ తరలించాలని తెలిపారు.

ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో రైతులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు సరిపడా యూరియా అందించకుండా రైతులను అరెస్టు చేయాలని ప్రభుత్వం చూడడం సిగ్గుచేటు అన్నారు. అరెస్టు చేసిన టిఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అయినవారిలో టిఆర్ఎస్ నాయకులు భూంరెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిప్పిరి వెంకటి, కౌన్సిలర్లు గరిగంటి లక్ష్మీ నారాయణ, మన్సూర్, కాసర్ల స్వామి, మాజీ కౌన్సిలర్ లు కృష్ణాజిరావు, అంజల్ రెడ్డి , పట్టణ మాజీ యూత్ అధ్యక్షులు భాను ప్రసాద్, నరేష్ రెడ్డి, ఫిరోజ్, శౌకత్ అలీ లను పోలీసులు అరెస్టు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.