12 August, 2026 | 3:48 PM

కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ నాయకులు

12-08-2026 01:13 PM

ఆసిఫాబాద్ ( విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన కేసు నేపథ్యంలో బుధవారం బిఆర్ఎస్ నాయకులు కోర్టుకు హాజరు అయ్యారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నిబంధనలు ఉల్లగించారని బి ఆర్ ఎస్ అభ్యర్థి మద్దతుదారులు, నాయకులు మూకుమ్మడిగా కలెక్టరేట్ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. నిబంధనల ప్రకారం బిఆర్ఎస్ నాయకులు అనుసరించలేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అప్పటి కలెక్టర్ ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే కు ఫిర్యాదు చేయడంతో బిఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. దీంతో కేసు పేసికి నాయకులు హాజరయ్యారు.