29 July, 2026 | 6:04 PM

Breaking News

బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక   •   వందేళ్ల మామిడి చెట్టు.. నెలా మట్టం   •   అర్హులైన ప్రతి ఓటరు పేరు... ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడండి   •   గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం   •   ప్రసూతి తల్లులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందించాలి   •   ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన సింగరేణి వైసీఓఏ లేడీస్ క్లబ్   •   మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ   •   ఆర్మూర్ లో వన మహోత్సవం   •   కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలేటి ఆనందరావు నియామకం   •   భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి   •  

బీఆర్‌ఎస్ నాయకుడి తల్లి మృతి

17-03-2026 06:05 PM

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం… 

సనత్‌నగర్,(విజయక్రాంతి): మాజీమంత్రి, సనత్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడిని పరామర్శించారు. అమీర్ పేటకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కుశ్వంత్ సింగ్ మాతృమూర్తి బిశ్వేశ్వర్ కౌర్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం అమీర్ పేట లోని వారి నివాసానికి వెళ్లారు.

ఆమె పార్దీవ దేహంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుశ్వంత్ సింగ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నామన సంతోష్ మణికుమార్, నాయకులు జోగిందర్ సింగ్, దర్శన్ సింగ్, చన్నీ సింగ్, కూతురు నర్సింహ, సుమిత్ సింగ్ తదితరులు ఉన్నారు.