17 March, 2026 | 9:08 PM

జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

17-03-2026 06:01 PM

కుబీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాల, కేజీబీవీ కళాశాలలో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించి గురుకుల సెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డానియల్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈనెల 16 నుండి వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎంపీసీ బైపిసి ఎంఈసి హెచ్ ఈ సి ఎంపీహెచ్డబ్ల్యు ఇతర కోర్సులు అందుబాటులో ఉన్నాయి తెలిపారు మే 3న పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు రిజర్వేషన్ పద్ధతిలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగించుకోవాలన్నారు