అమెరికాకు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
- వారం రోజుల పర్యటన
- బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించనున్న కేటీఆర్
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాకు వెళ్లారు. వారం రోజుల పర్యటనలో భాగంగా మంగళవా రం ఉదయం ఆయన అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆ యన న్యూయార్క్ నగరంలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించనున్న ‘కొలంబియా ఇండి యా బిజినెస్ కాన్ఫరెన్స్2026’లో పా ల్గొని ప్రసంగించనున్నారు.
ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రం గం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి వ్యూ హాలపై ఆయన అనుభవాలను పంచుకోనున్నారు. గతంలో ఆయన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా సాధించిన విజయాలు, పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చిన తీరును దృష్టిలో ఉంచుకుని కేటీఆర్‌కు ఈ ఆహ్వానం అందింది.
ఇదిలా ఉంటే ఈ పర్యటనలో కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును కూడా కలవనున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతోపాటు, కొంత సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడపనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరిగి వచ్చాక తన రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నట్లు కేటీఆర్ తెలిపారు.




