బాధిత కుటుంబానికి బీఆర్‌ఎస్ నేత చల్మెడ పరామర్శ
వేములవాడ, ఆగస్ట్ 2, (విజయ క్రాంతి): వేములవాడ పట్టణంలోని భగవంతరావునగర్కు చెందిన జవ్వాజి సంపత్వ్రళి దంపతుల రెండో కుమార్తె రిహాన్షి (8) బ్రెయిన్కు సంబంధించిన వ్యాధితో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఈ నేపథ్యంలో ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ వే ములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ ల క్ష్మీనరసింహారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన, చిన్నారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాదాడి గజానందరావు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గోలి మహేష్, నిమ్మశెట్టి విజయ్, రాపెల్లి రాంబాబు, పెద్ది రాజు, మంత సందీప్, ప్రేమ్ చారి, మణికంఠ, మెండే రాజు తదితరులు పాల్గొన్నారు.






