29 April, 2026 | 1:33 PM

ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 08:52 PM

చర్ల,(విజయక్రాంతి): మండల కార్యాలయంలో బీ ఆర్ యస్ ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఘనంగా జండాను ఆవిష్కరించి నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు.

పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని అన్నారు పార్టీ పట్ల నిబద్ధత, ఐక్యత ఉంటే బిఆర్ఎస్ మరింత శక్తివంతమవుతుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవుటవలన రాష్ట్రంలో ఏ వర్గానికి ప్రజలకు న్యాయం జరగటం లేదు ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి కెసిఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలని తెలియజేసారు ఈ కార్యక్రమం లో కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ సీనియర్ నాయకులు యస్ డీ  అజీజ్, పంజా రాజు,గొర్ల రాజబాబు,యడ్ల రామదాసు, మెంతుల నాగరాజు,బుల్లేబ్బాయి, దుబ్బా సమ్మయ్య, తోటపల్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు