27 April, 2026 | 10:21 PM

ఘనంగా బీఆర్‌ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం

27-04-2026 08:47 PM

భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాచలంలో సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ 26 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్‌ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కలిసి పోరాడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా పరజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మానె రామకృష్ణ, కోటగిరి ప్రబోద్‌కుమార్‌, రేపాక పూర్ణ, ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.