27 April, 2026 | 4:00 PM

కోనరావుపేటలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 02:26 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తెలంగాణ జెండాను ఎగురవేశారు.

జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు తెలంగాణ నినాదాలతో మార్మోగిస్తూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.అనంతరం అందరికీ స్వీట్లు పంచి, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ వేడుకలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి గ్రామ అధ్యక్షులు రాస రత్నాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మందాల శ్రీనివాస్, నాయకులు ముడారి శ్రీనివాస్, చిట్టినేని శివతేజ, గంగసాని రమణ, కాసర్ల రాజు, యాస రాజం, యాస శ్రీనివాస్,రాజేశం స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.