రేపు ఢిల్లీకి బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం
14-07-2026 01:52 AM
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను తక్షణమే పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ఈ నెల 15న ఢిల్లీకి వెళ్లనుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలోని సీసీఐ సాధన కమిటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించనుంది.
ఈ ప్రతినిధి బృందంలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్రతోపాటు పలువురు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొంటారు. సీసీఐ పునఃప్రారంభంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునేలా విజ్ఞప్తి చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని పార్టీ తెలిపింది.






