7 May, 2026 | 2:11 PM

Breaking News

పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •  

మొదటి సమావేశంలోనే “కుర్చీ” లొల్లి

28-02-2026 01:41 PM

మున్సిపల్ కార్యాలయం ఎదుట వైస్ చైర్మన్‌తో పాటు బిఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన

కాగజ్‌నగర్, (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీ(Kagaznagar Municipality) నూతన పాలకవర్గం సర్వసభ్యుల ప్రారంభ సమావేశం ‘కుర్చీల’ లొల్లి‌తోనే మొదలైంది. శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించాల్సిన మొదటి సర్వసభ్య సమావేశానికి ముందే ఈ వివాదం చెలరేగింది. ప్రతి సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పక్కనే వైస్ చైర్మన్‌కు కుర్చీ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అయితే ఈ సమావేశంలో చైర్‌పర్సన్ పక్కన వైస్ చైర్మన్ కుర్చీ లేకపోవడంతో, వైస్ చైర్మన్‌తో పాటు బిఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు.

మున్సిపల్ వైస్ చైర్మన్(Municipal Vice Chairman) డాక్టర్ అనితకు చైర్‌పర్సన్ పక్కనే కుర్చీ వేయకపోవడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక మహిళా వైస్ చైర్మన్‌ను అవమానించడంపై బిఆర్ఎస్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్‌కు మద్దతుగా నిలిచారు. దీనికి నిరసనగా వైస్ చైర్మన్‌తో పాటు బిఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రారంభ సమావేశం కౌన్సిలర్ల మధ్య కుర్చీల లొల్లి, ప్రోటోకాల్ వివాదంతోనే ముగిసింది. ఈ కుర్చీల వివాదం ప్రధాన పార్టీలో చర్చనీయాంశంగా మారింది.