7 May, 2026 | 3:12 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ఎఆర్ఎస్ఐ శ్రీనివాస్‌కు ఘన సన్మానం

28-02-2026 01:44 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎ.ఆర్.ఎస్.ఐ. శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా శనివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి, పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రూ.1,57,146 విలువైన చెక్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ శాఖకు మంచి పేరు తీసుకువచ్చినందుకు శ్రీనివాస్ సేవలను ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు.

శ్రీనివాస్ 1989లో కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, 2016లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2021లో ఎ.ఆర్.ఎస్.ఐ.గా పదోన్నతి పొందారు. మూడు దశాబ్దాలకు పైగా వివిధ విభాగాల్లో సేవలందించి సహచరులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు.

పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్.ఐలు, పోలీస్ సంఘ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.