ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్స్ విద్య ప్రారంభం
18-07-2026 01:54 PM
ఎర్రుపాలెం జూలై 18 (విజయ క్రాంతి): మండల పరిధిలోని బనిగండ్లపాడు బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఆక్సల్ ప్రోగ్రాం ద్వార ఇవ్వబడిన కంప్యూటర్స్ ను మధిర మార్కెట్ యార్డు చైర్మన్ బండారు నరసింహారావు శనివారం నాడు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ పిల్లలు ఉన్న పాఠశాల కావటం పాట్ల హెడ్మాస్టర్ ని అభినందిస్తూ కంప్యూటర్ విద్యాను సద్వినియోగం చేసుకోవాలని కోరరు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకరరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాసరెడ్డి,గ్రామ సర్పంచ్ నాగరాజు,అక్కిరెడ్డి, పిచ్చిరెడ్డి శ్రీనివాసరెడ్డి,వెంకటరామిరెడ్డి ప్రధానోపాధ్యాయుడు జంగా గురునాధరెడ్డి మరియు సిబ్బంది పాల్గోనారు.






