వాగుపై వంతెన నిర్మాణ పనులు షురూ
ఉట్నూర్, మార్చి 13 (విజయక్రాంతి): జిల్లాలోని ఏజెన్సీ ప్రాం తాల్లో నూతన వంతెన నిర్మాణ పనులను ఆర్ అండ్ బి అధికారులు ప్రారంభించారు. ‘ప్రమాదకరంగా పాత వంతెనలు‘ అనే శీర్షికతో ‘విజయక్రాంతి‘ దినపత్రికలో ఫిబ్రవరి 26న, కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆర్ అండ్ బి అధికారులతో పాటు గుత్తేదారుతో మాట్లాడి పను లు ప్రారంభించేలా కృషి చేశారు.
వంతెన నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్ అండ్ బి శాఖ ఎస్.ఈ వెంకట వేణు, ఈ.ఈ నర్సయ్యలు పాత వంతెనలను తొలగిం పునకు శుక్రవారం శ్రీకారం చుట్టా రు. పాత వంతెనను తొలగించిన వెంటనే కొత్త వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభిస్తామని ఎస్‌ఈ వెంకట వేణు అన్నారు. ఉట్నూరు మం డలం పులిమడుగు వాగుపై నిర్మించే వంతెనను రెండు నెలల లోపు పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బంది రాకుండా చూస్తామని ఎస్.ఈ అన్నారు.




