1 August, 2026 | 1:55 AM

స్కూల్ సిబ్బందికి బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం

01-08-2026 12:42 AM

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులకు అమ లు చేస్తున్న బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులతో పాటు సిబ్బందికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో పాటు అందించాలి. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవో, ఆర్జేడీ, ఎంఈవో, హెచ్‌ఎంలకు ఆదేశాలిచ్చింది. పోర్టల్‌లో టీచింగ్, నాన్‌టీచింగ్ వివరాలను నమోదు చేయాలి.