దర్జాగా రేషన్ బియ్యం దందా!
- సరిగ్గా తూకం మూటలు పెట్టి కాంట
- థంబు వేయండి.. డబ్బులు తీసుకెళ్లండి
- మూడు నెలల రేషన్ డబ్బులు మీ ఖాతాలో వేస్తాం
- రేషన్ షాపుల్లో బియ్యం కు బదులు నగదు అందజేతా?
- తనిఖీలు మరిచిన సంబంధిత అధికార యంత్రాంగం
- డబ్బులు ఇస్తే చర్యలు తీసుకుంటాం : నర్సింగరావు, తాసిల్దార్ జడ్చర్ల
జడ్చర్ల, ఆగస్టు 17 : రేషన్ బియ్యం ఒకేసారి మూడు నెలలు వేస్తున్నారు...ఈ అవకాశం ఈనెల చివరి వరకే ఉంది.. మీరు రాకుంటే మూడు నెలల రేషన్ కట్ అవుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ రేషన్ షాపుల్లో నగదు దందా ను కొందరు ద్వేషం షాపు నిర్వాహకులు దర్జాగా చేస్తుండ్రు.
ఒక్కసారి రేషన్ షాప్ ను సంప్రదించి థంబు ఉంచితే మూడు నెలల రేషన్ బదులు నగదు మీకు అప్పజెప్తామని లబ్ధిదారులను ప్రోత్సహించడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ అవి మాకు పట్టా ఉన్నట్లు వ్యవహరిస్తూ నగదు అందించేందుకు ఆసక్తి చూపడం విడ్డూరంగా ఉంది. నియంత్రించాల్సిన అధికార యంత్రంగా మాత్రం అటువైపు చూడడమే మానేసిన్రు. దీంతో రేషన్ దుకాణాల్లో నయా వ్యాపారం నగదు రూపంలో చలామణి అవుతుందని బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు ఈ ఆరోపణలు వాస్తవమే అంటూ చెప్పడం విశేషం.
పక్కా ప్రణాళికలతో నగదు అందజేత..
కొందరు రేషన్ దుకాణాల డీలర్లు తమ రేషన్ షాపులోనే ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కిలో కు రూ 10 నుంచి 12 లను అందజేస్తుండ్రు. మరికొందరు అయితే ఇలా ఇస్తే ఎవరైనా ఎక్కడైనా బహిర్గతమయ్యే అవకాశం ఉందని వారి ఫోన్ నెంబర్లను తీసుకొని ప్రత్యేకంగా రాసుకొని ఇంటికి వెళ్లిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల ఖాతాలో నుంచి వారికి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
దీంతో ఆహార భద్రత దారి తప్పుతుందని ఈ బియ్యం తిరిగి రీసైకిలింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రత్యేక తనిఖీలు చేపడితే నిజమైన లబ్ధిదారులకు మేలు జరగడంతో పాటు నిబంధనలు పాటించని డీలర్లపై చర్యలు ఉండే అవకాశం ఉంది. అత్యధిక షాపుల్లో ఇదే దందా కొనసాగుతుందని లబ్ధిదారులే ప్రత్యేకంగా చెబుతున్న మాట.
డీలర్‌షిప్‌లు రద్దు చేస్తాం:
రేషన్ సరుకుల పంపిణీలో నిబంధనలకువిరుద్ధం గా వ్యవహరించే డీలర్లపై కఠిన చర్యలుజడ్చర్ల తీసుకుంటం. లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన రేషన్ బియ్యం అందించాల్సి ఉండగా,దాని బదులు డబ్బులు ఇవ్వడం లేదా పంపిణీలో అక్రమాలకు పాల్పడడం వంటి చర్యలను సహించం.
పారదర్శకంగా సరుకులు పంపిణీ చేయాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డీలర్షిప్లను రద్దు చేస్తాం. ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను ప్రతి రేషన్ డీలర్ తప్పనిసరిగా పాటించాలని,అక్రమాలకు పాల్పడితే ఎలాంటి మినహాయింపు ఉండదు.
నర్సింగ రావు,
తహసీల్దార్, జడ్చర్ల






