19 August, 2026 | 4:43 AM

చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలి

19-08-2026 12:00 AM

టీపీసీసీ చీఫ్‌కు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు

వనపర్తి, ఆగస్టు 18 ( విజయక్రాంతి ) : కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డిపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు చర్యలు తీసుకోవాలని కో రుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డి మంగళవారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వెంట వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీభవన్కు తరలివచ్చారు.