27 March, 2026 | 3:20 AM

శభాష్.. విద్యార్థులు

27-03-2026 12:00 AM

నిర్మల్, మార్చి ౨౬ (విజయక్రాంతి): మనుషులకు దాహం వేస్తే నీటి వనరుల వద్దకు వెళ్లి దాహాన్ని తీసుకుంటాం. అయితే నోరులేని పక్షులకు వేసవికాలం వచ్చిందంటే ఎక్కడ చుక్కబొట్టు మీరు కల్పి స్తే అక్కడికి కీచు కీచు మంటూ వస్తుంటాయి. పట్టణంలో సోఫినగర్ గురుకుల పాఠశాలలో నీటి కోసం ఇబ్బందులు పడుతున్న పక్షులను చూసి విద్యార్థులు నీటి తట్టాలను ఏర్పాటు చేశారు. ప్రతి చెట్టుకు నీటి తట్టాను ఏర్పాటు చేసి ఆ తట్టాలో ఓ విద్యార్థి నీరు పోసే బాధితులు ప్రిన్సిపల్ డేనియల్ అప్పగించారు. దీంతో విద్యార్థులను పలువురు అభినందిస్తున్నారు.