27 March, 2026 | 1:37 AM

అభివృద్ధికి అడ్డుగా అటవీ చట్టాలు

27-03-2026 12:00 AM
  1. ఆదివాసీ బిడ్డలు పోరుబాట పట్టినా.. కనికరించూపని అధికారులు.. పాలకులు
  2. ఆదివాసీగూడలో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెండేళ్లుగా డిమాండ్
  3. ఇప్పటికీ రెండుసార్లు 75 కిలోమీటర్ల పాదయాత్ర
  4. నేటికీ అందని త్రీ ఫేజ్ 

గూడెంలో ఉంటూ వ్యవసాయం అటవీ ఉత్పత్తులే జీవనాధారంగా బతుకుతున్న ఆదివాసీ గిరిజనుల బిడ్డలు.. తమ తండాలో మౌలిక సదుపాయాలు లేక పోరుబాట పట్టినా ఆ ప్రజల బతుకుల్లో వెలుగులు కరువయ్యాయి. ప్రభుత్వాలు మారిన.. పాలకులు మారిన.. అధికారులు హామీలు ఇచ్చిన.. తమ బతుకులు మారలేదు అంటూ.. పెంబి మండలంలోని మారుమూల ఆదివాసీ గూడేల గిరిజను లు హక్కుల కోసం ఉద్యమం దిశగా కదులుతున్నా..

అధికారులు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు.. ఈ గూడేల్లో నేటికీ సరైన రవాణా మార్గాలు, సీసీ రోడ్లు, మురికి కాలువలు ప్రభుత్వ పథకాలైన అంగన్వాడి భవనాలు పాఠశాల భవనాలు ఇతర అభివృద్ధి పనులు నోచుకోవడం లేదు.   కొన్ని గిరిజన గూడెలకు చెట్లు ఎత్తున గుట్టలు ఎక్కి తేగాని నేటికీ ఇంటర్నెట్, సెల్ ఫోన్ సిగ్నల్ రావు. ఇదీ నిర్మల్ జిల్లాలోని ఆదివాసీ, గిరిజన పరిస్థితి.. 

నిర్మల్, మార్చి ౨౬ (విజయక్రాంతి):  ప్రభు త్వం తలకు మౌలిక సదుపాయాలు కల్పించి సంక్షేమ పథకాలను దరికి చేర్చాలని ఆదివాసి గిరిజన పాదయాత్ర నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పెంబి మండలంలోని యాపాలగూడ నుండి నుంచి నిర్మల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. 73 కిలోమీటర్లు ఆదివాసి గిరిజన బిడ్డలు నడుచు కుంటూ వచ్చి జిల్లా కలెక్టర్‌కు సమస్యలపై నివేదిక ఇచ్చారు.

సరిగ్గా రెండేళ్ల క్రితం పెంబి మండలంలోని చాకిరేవు, గుమ్మెన అంకెన గిరిజనులు తమ గూడాలో కనీసం నీటి సౌకర్యం లేదని. విద్యుత్ , వైద్యం విద్య వంటి సౌకర్యా లు కల్పించాలని స్వచ్ఛందంగా నిర్మల్ వరకు పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో పది రోజులు ఆందోళన చేసి వంటావార్పు పిల్లాపాపలతో రోడ్డుపైనే నిరసన తెలిపారు. దీనికి స్పందించిన అప్పటి అధికారులు గిరిజన గూడెం నీటి సౌకర్యం కల్పించి మిగతా అభివృద్ధి పనులను చేపడతామని హామీలు ఇచ్చిన అటవీశాఖ చట్టం అడ్డు రావడంతో అభివృద్ధి నిలిచిపోయింది అని గిరిజనులు అధికారులకు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. 

వర్షాకాలం వస్తే...

నిర్మల్ జిల్లా మారుమూల గిరిజన మండలమైన పెంబి మండలంలోని అనేక ఆదివాసి గిరిజన గూడాల్లోఉంటున్న ఆదివాసులకు ఇప్పటికీ కనీస సౌకర్యాలు నోచుకోవడం లేదు 2016లో పరిపాలన సౌలభ్యం కోసం కోసం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి నిర్మ ల్ జిల్లాగా ఏర్పాటు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం లోని పెంబి మండలాన్ని కొత్తగా ప్రకటించారు. ఈ మండలంలో మొత్తం 25 జీపీలు ఉండగా అన్ని ఆదివాసి గిరిజన గ్రామ పంచాయతీలే. ఒక్కొక్క గూడెంలో 20 నుంచి 50 కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి.

ఈ గూడేలకు వెళ్లాలంటే కడెం పసుపుల వాగు దాటి వెళ్లాలి. రెండు సంవత్సరాల క్రితం పసుపుల వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మిస్తే అది భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. కొత్త బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికి జరగలే. వర్షాకాలం వస్తే సుమారు 30 ఆదివాసి గూడెలకు రవాణా సదుపాయం కట్ అవుతుంది. నాలుగు నెలలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తారు. అత్యవసర పరిస్థితులు వాగులు దాటేందుకు తాళ్లు పడవలను ఉపయోగించుకుంటారు.

ముఖ్యంగా ఆరోగ్యం ఏర్పడ్డ, ఆదివాసి బిడ్డలు ప్రసవాలు జరిగిన దేవుడు పైన భారం వేస్తా రు. గిరిజన గూడెం ప్రస్తుతం సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఇస్తుండగా మూడు గూడలో సింగల్ ఫేజ్ కరెంటు లేదు. మూడు ఫేసుల కరెంటు ఇస్తే ఆ ప్రాంతంలో బోర్లు వేసుకొని వ్యవసాయ పంప్ సెట్ ల ద్వారా వ్యవసాయం రెండు పంటలు సాగు చేసుకుంటామని రైతులు పేర్కొంటున్నారు. 

తమ సమస్యల పరిష్కారానికి ప్రతి ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చిన అవి నెరవేర్చడం లేదు. అందుకే గిరిజనులు తమ హక్కుల కోసం ఇప్పటికీ రెండు సార్లు కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించా రు. త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వాలని ఆరు నెలలుగా కలెక్టర్‌తోపాటు వరంగల్ ఎండీని, ముఖ్యమం త్రిని సైతం కలిసినట్టు వారు తెలిపారు.

ఇవి టైగర్ జోన్ పరిధిలో ఉండడంతో కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం గ్రామపంచాయతీలు అంగన్వాడీ భవనాలు పాఠశాల ప్రహరీ గోడ లు ఇందిరమ్మ ఇండ్లు ఇతర అభివృద్ధి పను లు మంజూరు చేస్తున్న అటవీ శాఖ అధికారు లు వాటిని అనుమతులు లేవని నిలుపుదల చేస్తున్నారని ఆదివాసి గిరిజన గుడాల ప్రజలు జిల్లా అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెంబి మండలం నుంచి సుమారు 400 మంది గిరిజనులు 73 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి కలెక్టర్‌కు  తమ సమస్యను స్వయంగా చెప్పుకున్నారు. కానీ, నేటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి.. 

పెంబి మండలంలోని మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్ప నపై ఎన్నోసార్లు అధికారులకు విన్నవించిన. కొన్ని చోట్ల ప్రభు త్వం నిధులు మంజూరు చేసిన అటవీ శాఖ అధికారులు అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన ఆదివాసి గూడెంలో ప్రజలకు  మౌలిక సదుపాయాలు కల్పించాలి. 

 జానుబాయి, మాజీ జడ్పీటీసీ 

పనులకు అడ్డు చెప్తున్నారు.. 

కోరుకంటి ఆదివాసీ గిరిజన గ్రామపంచాయతీలో ప్రభుత్వపరంగా అభివృద్ధి పనులకు నిధు లు మంజూరైన  జీపీ, అంగన్వాడీ, పాఠశాల ప్రహరీ గోడతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుందామ న్న అటవీ అధికారులు అనుమతులు ఇవ్వ డం లేదు. కలెక్టర్ దృష్టికి ఎన్నోసార్లు తెచ్చినం. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు.

 జనార్ధన్ ఊరుకంటి, ఉపసర్పంచ్