8 August, 2026 | 11:23 AM

మాజీ కౌన్సిలర్ అధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

08-08-2026 10:34 AM

రామచంద్రపురం ఆగస్టు 8: రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని జ్యోతిరావు పూలే కాలనీలో మాజీ సర్పంచ్ కొల్లూరి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ భరత్ అధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా జోగిని శ్యామల బోనమెత్తి డోలు సపుడ్ల మధ్యన బోనం ఎత్తీ నృత్యం చేసుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతున గత 30 సంవత్సరాల నుండి అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నాం అని ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మధ్య చల్లగా ఉండాలనీ అందరు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలనీ కోరుతున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు నాయకులు ,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.