8 August, 2026 | 12:17 PM

బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది

08-08-2026 11:01 AM

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నంబర్ 10లో శనివారం తెల్లవారుజామున ఒక భవనం సెల్లార్‌లో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, HYDRAA సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని భవనం నుంచి 11 మందిని రక్షించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. సమాచారం ప్రకారం, భవనం నేలమాళిగలో ఒక వైన్ షాపు గోడౌన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ పొగ నేలమాళిగను పూర్తిగా కమ్మేయడంతో, మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కాస్త కష్టంగా మారింది. ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణం, జరిగిన నష్టం తీవ్రతకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు.