8 August, 2026 | 12:00 PM

కాసోజు శంకరమ్మకు ఘన సన్మానం

08-08-2026 10:37 AM

ఆలేరు, ఆగస్ట్ 08 (విజయక్రాంతి): తెలంగాణ పొలిటికల్ యువజన సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు తంగళ్లపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు, మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో శ్రీకాంతాచారి విగ్రహ ప్రతిష్ఠాపనపై కమిటీ సభ్యులు ఆమెతో చర్చించారు. శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయమని, ఆయన విగ్రహం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఇంజమూరి రామన్న, రాష్ట్ర అధ్యక్షులు సింగపాక నవీన్ బిల్లా, జిల్లా నాయకులు తొర్రి సురేష్, కొంగరి మహేష్ కుమార్, మహంకాళి సురేష్ చారి, సురుపంగ కుమార్, నమోజు రాజుచారి, కుంచం రాజు తదితరులు పాల్గొన్నారు.