8 August, 2026 | 11:59 AM

ప్రజల శాంతియుత జీవనం కోసమే.. పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్

08-08-2026 10:52 AM

తాండూరు డి.ఎస్.పి.

తాండూరు, ఆగస్టు 8,(విజయక్రాంతి): ప్రజల శాంతియుత జీవనం కోసమే కార్డెన్ అండ్ సెర్చ్ (కమ్యూనిటీ కాంటాక్ట్) నిర్వహించినట్లు వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్  నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 65 బైకులు, 3 ఆటోలు,54 మద్యం సీసాలు, గుట్కా పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ అనుమానస్పద స్థితిలో నూతన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. సరైన ధ్రువపత్రాలు ఉన్న వాహన యజమానులు వాహనాలను తీసుకెళ్లాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు స్థానికులు సహకరించాలని ఆయన కోరారు.ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పరమేశ్వర్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.